Archive for July 2011
నాకు నచ్చిన గాలీబ్ గీతాలలో కొన్ని
ఏల కాళ్ళు నొచ్చె బాలామణి కి
రాత్రి ఎవరి స్వప్న సీమ కేగి వచ్చెనో!
ఎచట నీ పదాంకములు నీక్షింతునచట
అడవి దారియు నందనమట్లు తోచు
ఆమె ముద్దిచ్చుటకు వెనకాడదేమో!
కాని ఇమ్మని అడగ వెనకాదినాను..
గుండె దొంగాలించుకుపోయే జంకక
ముద్దోసంగ వెనుక ముందులాడు..
అన్ని బంధాల విదిలించినట్టి యెడద
కురుల ఉరులందు నన్ చిక్కుకోనేను చెలియ
వ్రాయనేమి లేక పోయియు నీ పేరుచేర్చి వ్రాతునొక చిన్ని లేఖ
నీదు పేరు వలచి, నిలిచి యున్నడను, కాంక్షలూరు వలపుకాడ నేను
ఏ అలంకరనయు లేని సేయక గూడా
ప్రియుల మొహపరుతువేమో! నీవు?
ఆమె తోటకి వ్యాహళి కరిగేనంట
ఇంక తోటలో పూలు వంచించు నెవడు?
నీవు ప్రేమతో వచ్చుట పూవు తోటకెంత యో సంతసమ్ము కల్గించే ననగ
చేయి సాచి నిన్ కౌగిట చేర్చ గోరి మొగ్గల్ని వికసించ మొదలు పెట్టె…
ఏల నను మరిచే నెరుగ బోయితి, నామే
వలపు చూపు చూచే భాస్మమైతి
నీ పరధ్యాన మేదో ఘనిష్టమైన
ప్రణయ రహస్యమును బయల్పరుచుచుండే